News May 25, 2024
వారంలో అద్దె చెల్లించకుంటే మళ్లీ స్వాధీనం: TGSRTC
TG: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్ వారంలోగా తమకు బకాయిలు చెల్లించకపోతే మళ్లీ స్వాధీనం చేసుకుంటామని TGSRTC MD సజ్జనార్ తెలిపారు. ‘హైకోర్టు ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో అద్దె సకాలంలో చెల్లించకుంటే ముందస్తు నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకోవచ్చు. మాల్‌లోని సబ్ లీజ్ దారుల ప్రయోజనం దృష్ట్యా ఓపెన్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో నిన్న మాల్ తెరిచేందుకు అనుమతి ఇచ్చాం’ అని Xలో పేర్కొన్నారు.
Similar News
News December 29, 2024
ఇతడు నిజమైన రాజు!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు, ప్రఖ్యాతులు ఎంత గొప్పవో పైన ఫొటో చూస్తే తెలుస్తోంది కదూ! పై ఫొటోలో ఉంది భూటాన్ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్. మన్మోహన్ మరణవార్తను తెలుసుకుని ఢిల్లీకి వచ్చారు. కింద కూర్చొని సింగ్ సతీమణి గుర్‌శరణ్ కౌర్‌ను ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. తాను రాజుననే విషయం మర్చిపోయి అత్యంత గౌరవంగా వ్యవహరించారు. అతడు నిజమైన రాజు అని నెటిజన్లు అభినందిస్తున్నారు.
News December 29, 2024
నెలాఖరులో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?
TG: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత మూడు రోజుల్లో రూ.565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు రూ.1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News December 29, 2024
జనవరి 1న సెలవు లేదు
జనవరి 1న ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.