News May 25, 2024
జూ.ఎన్టీఆర్‌పై వెంకన్న వ్యాఖ్యలు చంద్రబాబు పనే: YCP

AP: జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన <<13311204>>వ్యాఖ్యలపై<<>> వైసీపీ Xలో విమర్శలు గుప్పించింది. ‘టీడీపీకి అసలు వారసుడైన ఎన్టీఆర్‌పై టీడీపీ నేత వెంకన్న నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో ఈ మాటలు అనిపిస్తోంది చంద్రబాబు కాదా? రాజకీయాలకు పనికిరాని లోకేశ్‌ను పైకి తీసుకురావడానికి CBN చేసే వెన్నుపోటు రాజకీయాలకు ఇదే నిదర్శనం’ అని పేర్కొంది.
Similar News
News December 29, 2025
AI కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు సేవలు: TTD AEO

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని TTD AEO వెంకయ్య చౌదరి తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని వెల్లడించారు. ప్రతిచోటా టెక్నాలజీని వాడుకుంటున్నామని, AI కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తుల దర్శనం, వెయిటింగ్, వాహనాల పార్కింగ్ సహా అన్నింటినీ మానిటర్ చేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లడ్డూల కౌంటర్లు కూడా పెంచామన్నారు.
News December 29, 2025
‘లేడీ సింగం’.. కిడ్నాపర్ల పాలిట సింహ స్వప్నం!

ఢిల్లీ పోలీస్ అధికారిణి సీమా కేవలం 3 నెలల్లో 76 మంది అదృశ్యమైన చిన్నారులను రక్షించి శభాష్ అనిపించారు. ప్రమాదకర నిందితులను ఎదుర్కొంటూ ఆమె చేసిన ఈ ఆపరేషన్‌లో ఎక్కువ మంది కార్మికుల పిల్లలే ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టుదలతో ఆమె చేసిన ఈ కృషిని గుర్తించిన ప్రభుత్వం.. సీమాకు కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా పదోన్నతి కల్పించింది. విధి నిర్వహణలో ఆమె చూపిన అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
News December 29, 2025
రక్షణ రంగంలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు

భారత రక్షణ రంగంలో అదానీ గ్రూప్ రూ.1.8 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి మానవరహిత, అడ్వాన్స్‌డ్ గైడెడ్ వెపన్స్, డ్రోన్లు, స్మార్ట్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి సారించనుంది. AI ఆధారిత యుద్ధ సాంకేతికతతో సైనికుల ప్రాణాపాయాన్ని తగ్గించాలన్నది సంస్థ ఉద్దేశం. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన ‘దృష్టి-10’ యూఏవీలు(Unmanned Aerial Vehicles) భారత నౌకాదళంలో సేవలందిస్తున్నాయి.


