News May 25, 2024
ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

దేశంలో 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూఢిల్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఢిల్లీలో ఓటేశారు. ఝార్ఖండ్‌లోని రాంచీలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్, భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News October 31, 2025
చొరబాటుదారుల్ని వెనక్కి పంపిస్తాం: మోదీ

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారందరినీ వెనక్కి పంపిస్తామని PM మోదీ పునరుద్ఘాటించారు. చొరబాట్లు దేశ ఐక్యతకు ముప్పుగా మారుతాయని, గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. చొరబాట్లను అడ్డుకొనే వారికి అడ్డుపడుతూ కొన్ని పార్టీలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ‘దేశ భద్రతకు రిస్క్ ఏర్పడితే ప్రతి పౌరుడు ప్రమాదంలో పడినట్లే’ అని ‘ఏక్తాదివస్’లో PM హెచ్చరించారు.
News October 31, 2025
భారత్‌కు బిగ్ షాక్

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత టాపార్డర్ కుప్పకూలింది. 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గిల్ 5 రన్స్ చేసి ఔట్ కాగా తర్వాత సంజూ 2, సూర్య 1, తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. 9 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 24 రన్స్ చేశారు.
News October 31, 2025
ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: కవిత

TG: తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.


