News May 25, 2024

2.37 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం: కేటీఆర్

image

TG: ఏ రాష్ట్రంలోనూ 95% స్థానికత కోటా లేదని, తాము అటెండర్ నుంచి గ్రూప్-1 వరకు లోకల్ రిజర్వేషన్లు తెచ్చామని KTR తెలిపారు. ఉమ్మడి APలో INC పదేళ్ల పాలనలో 26,084 ఉద్యోగాలు భర్తీ చేస్తే.. తాము 2.37 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. ఇంతచేస్తే KCR ఉద్యోగాలు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చినవి తప్ప ఈ ఐదు నెలల్లో ఎవరికీ కొత్తగా జాబ్స్ రాలేదన్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: TPCC చీఫ్

image

జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. మెజారిటీ ఇంకా ఎక్కువ రావాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం ప్రభావం చూపుతోందన్నారు. BRS డైవర్షన్ పాలిటిక్స్‌ చేసిందని, మహిళల సెంటిమెంట్‌ను వాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అయినా ప్రజలు అభివృద్ధి కోసం ఆలోచించారని, ఈ ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

News November 14, 2025

వేంకటేశ్వరస్వామి: మీకు ఈ కథ తెలుసా?

image

తిరుమల సోపాన మార్గంలోని మోకాలి మెట్టు వద్ద రాతి పెట్టెలుంటాయి. అవే పద్మావతి అమ్మవారి 7 వారాల సార్లపెట్టెలని నమ్మకం. వివాహం తర్వాత శ్రీనివాసుడు, పద్మావతి కొండకు బయలుదేరారు. అప్పుడే స్వామివారికి ఇల్లాలున్న విషయం గుర్తొచ్చింది. దీంతో పద్మావతిని ‘కరివేపాకు తెచ్చావా?’ అని అడిగి, తిరిగి పంపాడు. అలా వెనక్కి వెళ్లి అమ్మవారు తిరుచానూరులో శిలగా మారారు. ఈ పెట్టెలు నగల కోసమేనని నమ్ముతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 14, 2025

NMLలో 21 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

NTPC మైనింగ్ లిమిటెడ్(NML)లో 21పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్ ), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://nml.co.in/en/jobs/