News May 25, 2024
శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి ఇదే నిదర్శనం: సీఈవో

AP: పల్నాడు జిల్లాలో పోలింగ్ నిర్వహణలో అధికారులు వైఫల్యం చెందారని వస్తున్న విమర్శల వేళ సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో 85.65 శాతం ఓటింగ్ నమోదవడం శక్తిమంతమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి నిదర్శనం’ అని రాసుకొచ్చారు. కవిసార్వభౌమ శ్రీనాథుడు, ఆధునిక కవిచక్రవర్తి జాషువా ఈ ప్రాంతానికి చెందినవారేనని పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. ఆయనకు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తదుపరి విచారణ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్ మరోసారి నోటీసులు ఇస్తుందా? ఎప్పుడు, ఎక్కడ విచారిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. తనను ఎర్రవల్లిలోనే <<18996095>>ప్రశ్నించాలని<<>> కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.
News January 29, 2026
నెలకు ₹5 లక్షల మేకప్.. పోలీసులకే షాకిచ్చిన ‘గ్లామరస్’ దొంగ

బెంగళూరులో ఓ ‘గ్లామరస్’ దొంగ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. భక్తి ముసుగులో గుళ్లు, రద్దీ ప్రదేశాల్లో బంగారాన్ని కాజేస్తున్న గాయత్రి, ఆమె భర్త శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ₹60 లక్షల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. సంపన్న మహిళగా కనిపిస్తే ఎవరూ గుర్తించరని.. అందుకోసం నెలకు ₹4-5 లక్షలు కేవలం మేకప్ కోసమే ఖర్చు చేస్తానని ఆమె అంగీకరించడం పోలీసులను షాక్‌కు గురిచేసింది.
News January 29, 2026
సహాయం చేయడంలోనే సంతోషం: విజయ్ సేతుపతి

ఇతరులకు సహాయం చేయడంలో, తను చేసే పనిలోనే సంతోషం ఉంటుందని యాక్టర్ విజయ్ సేతుపతి తెలిపారు. ఉపాధి లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రతినెలా రూ.లక్షన్నర ఖర్చు చేస్తున్నానని చెప్పారు. డబ్బు సంపాదిస్తేనే ఇవన్నీ చేయగలుగుతానని అప్పుడే సంతోషంగా ఉంటానన్నారు. సినిమాల్లోకి రాకముందు అకౌంటెంట్‌గా పనిచేశానని, ఆ పనిలోనూ ఆనందాన్ని పొందానని చెప్పారు. ఆయన నటించిన ‘గాంధీ టాక్స్’ రేపు విడుదల కానుంది.


