News May 25, 2024

కోచింగ్ అంటే ఇష్టమే.. కానీ: డివిలియర్స్

image

తనకు కోచింగ్ అంటే ఇష్టమేనని.. కానీ ఇప్పుడే ఆ పదవి చేపట్టలేనని సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నారు. రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తారా అన్న ప్రశ్నకు ఏబీడీ ఇలా సమాధానమిచ్చారు. ‘ఇప్పటివరకు కోచ్ పదవి గురించి ఆలోచించలేదు. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కోచింగ్‌ను ఆస్వాదిస్తా. కొన్ని జట్లు, కొందరు ప్లేయర్లతో పని చేసేందుకు నేనెప్పుడూ ఇష్టపడతా’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 24, 2026

వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎలా ఉండాలంటే?

image

బాత్రూం విషయంలో అశ్రద్ధ తగదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పగిలిన అద్దాలు, వాడని వస్తువులు, విడిచిన బట్టలు ఉంచొద్దని అంటున్నారు. ‘దీనివల్ల ప్రతికూల శక్తి పెరిగి మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. బాత్రూం విశాలంగా ఉండాలి. బకెట్లను నీళ్లతో నింపి ఉంచడం మంచిది. వాటర్ లీకేజీ వల్ల సమస్యలొస్తాయి. శరీరాన్ని శుద్ధి చేసే ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 24, 2026

ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్

image

RBI, నాబార్డు, PSGICల్లోని ఉద్యోగులు, రిటైరైన వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన, పెన్షన్ సవరణకు ఆమోదం తెలిపింది. దీని కోసం ₹13500Cr వెచ్చించనుంది. PSGICల్లో వేతనం 12.41%, పెన్షన్ 30% పెరుగుతుంది. నాబార్డులో జీతం 20% మేర, RBI, నాబార్డులలో పెన్షన్ 10% హైక్ అవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా 93,157 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు 2022 AUG, NOV నుంచి వర్తిస్తుంది.

News January 24, 2026

రాత్రి భోజనం తర్వాత ఇవి మర్చిపోవద్దు

image

రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిన్నర్ తర్వాత కనీసం 30-60 నిమిషాల పాటు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందని సూచిస్తున్నారు. భోజనం, నిద్ర మధ్య 2-3Hr విరామం ఉంటే మంచిదని అంటున్నారు. తిన్న వెంటనే స్నానం చేయడం, వాటర్ తాగడం మంచిది కాదని పేర్కొన్నారు. రాత్రి పూట తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.