News May 25, 2024
గూగుల్ తల్లిని నమ్మి.. నేరుగా కాల్వలోకి..!

కొత్త చోట్లకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్‌ను వాడటం పరిపాటే. అలా వాడటమే హైదరాబాద్‌కు చెందిన నలుగురి ‘కారు’ముంచింది. కేరళలోని అలప్పుళకు వారు టూర్ వెళ్లారు. ఆ సమయానికి భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుపై వరద కనిపిస్తున్నా గూగుల్‌పై నమ్మకంతో వారు ముందుకే వెళ్లారు. ఈ క్రమంలో వరద నీటి నుంచి కాల్వలోకి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ అందరూ బయటపడ్డారు కానీ కారు నీట మునిగింది.
Similar News
News January 7, 2026
తేనెతో చర్మానికి తేమ

పొడిబారే చర్మతత్వానికి తేనె ప్యాక్‌లు వాడితే బాగా తేమగా మారుతుందంటున్నారు చర్మ నిపుణులు. పచ్చిపాలకు తేనె కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. అలాగే తేనె, కలబంద, పాలు కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. చెంచా చొప్పున తేనె, కలబంద గుజ్జుకు రెండు చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పూత వేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మానికి తేమ అందుతుంది.
News January 7, 2026
TDP కొనసాగి ఉంటే గతంలోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం

AP: వైసీపీ ప్రభుత్వం వల్ల పోలవరం ఆలస్యమైందని, టీడీపీ కొనసాగి ఉంటే గతంలోనే పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో కనీసం డయాఫ్రమ్ వాల్‌ను కాపాడుకోలేకపోయారని విమర్శించారు. నిపుణుల సూచనలతో నిర్మిస్తున్న కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ఈ ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేస్తున్నామన్నారు. మెయిన్ డ్యామ్‌లోని ECRF-1 కంప్లీట్ చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి గ్యాప్-2 పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
News January 7, 2026
అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా ‘ధురంధర్’

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 33 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,222 కోట్ల వసూళ్లను సాధించింది. అటు ఇండియాలో రూ.831.40కోట్ల వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డులకెక్కింది. USలో $20M క్రాస్ చేసి బాహుబలి-2 తర్వాత ఆ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. త్వరలో ‘RRR’ వసూళ్లనూ బీట్ చేయనుంది.


