News May 25, 2024

IPL: ఫైనల్‌కు ముందు SRH కీలక నిర్ణయం

image

IPL ఫైనల్‌కు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు SRH ప్రాక్టీస్‌కు దూరంగా ఉంది. నిన్నే మ్యాచ్ ఆడటం, చెన్నైలో ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు ఇవాళ ప్రాక్టీస్ చేయట్లేదు. మరోవైపు కేకేఆర్ చివరగా మంగళవారం మ్యాచ్ ఆడటంతో ఆ ప్లేయర్లకు సరైన విశ్రాంతి లభించింది.

Similar News

News November 6, 2025

రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.5వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని ‘ఫతి’ స్పష్టం చేసింది. మిగతా రూ.5వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలంది. అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని.. అందుకే బంద్‌కు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.

News November 6, 2025

ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

image

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.

News November 6, 2025

5,346 టీచర్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఢిల్లీలో 5,346 <>TGT<<>> పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/