News May 25, 2024

తనకంటే మంచి బౌలర్ అవుతానని యువీ అన్నారు: అభిషేక్

image

SRH బ్యాటర్ అభిషేక్ నిన్న RRపై గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే బ్యాటింగ్‌కు బదులు బౌలింగ్‌తో అదరగొట్టారు. 4 ఓవర్లేసి శాంసన్, హెట్మయిర్ వికెట్లు తీశారు. తన తండ్రి వల్లనే బౌలింగ్ బాగా మెరుగుపడిందని మ్యాచ్ అనంతరం ఆయన తెలిపారు. ‘మా నాన్న, యూవీ నాకు అండగా నిలిచారు. తనకంటే నేను మంచి బౌలర్‌ను అని యువరాజ్ తరచూ చెబుతుండేవారు. నిన్నటి బౌలింగ్‌తో ఆయన హ్యాపీ అయ్యారనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News December 27, 2025

గుడికి వెళ్లొచ్చిన తర్వాత కాళ్లుచేతులు కడగకూడదా?

image

గుడికి వెళ్లొచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కడగకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా కడిగితే గుడిలో లభించిన దైవిక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయంటున్నారు. ‘ప్రదక్షిణల ద్వారా పాదాలు, పూజ ద్వారా శరీరం గ్రహించిన శక్తిని వెంటనే నీటితో కడిగేయకూడదు. కనీసం 15-20 నిమిషాల వరకు వేచి ఉండటం మంచిది. అయితే ఏదైనా తినే ముందు లేదా అపరిశుభ్రంగా అనిపిస్తే చేతులు కడుక్కోవడంలో తప్పు లేదు.

News December 27, 2025

స్వయంకృషి: మెటల్ ఇన్వెస్ట్‌మెంట్

image

సింపుల్‌గా చెప్పాలంటే బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడి. ఇవేకాక కాపర్, అల్యూమినియం, ఐరన్ ఇలా చాలా మెటల్స్ ఉన్నాయి. ఇవి అంతర్జాతీయంగా నిరంతరం వినియోగంలో ఉంటాయి. ధరలు పెరుగుతాయి, లేదా కొంత కరెక్షన్ ఉంటుంది తప్ప పడిపోవు. కొంతకాలం మెటల్ మార్కెట్‌ను పరిశీలిస్తే మీకు అవగాహన వస్తుంది. నెల క్రితం కేజీ వెండి ఇవాళ్టి కంటే రూ.1లక్ష తక్కువ. నెలలో ఎంత లాభమో చూశారుగా.
రోజూ ఒంటిగంటకి ఓ బిజినెస్ ఐడియా

News December 27, 2025

IOCLలో 501 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నార్తర్న్ రీజియన్‌లో 501 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 9 వరకు NATS/NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com