News May 25, 2024

INICETలో ధర్మవరం యువతికి ఆల్ ఇండియా 19వ ర్యాంకు

image

ధర్మవరం పట్టణానికి చెందిన అంబటి నైమిశా INICETలో ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించారు. కర్నూలు పుల్లారెడ్డి డెంటల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. INICET పరీక్ష రాసి ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించడంతో పలువురు ఆమెను అభినందించారు. నైమిశా మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ విజయం సాధించానని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు

image

గ్రామీణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సంబరాలలో ఎస్పీ జగదీశ్ దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. భోగి మంటలు వెలిగించి గాలిపటాలు ఎగురవేశారు. ఎస్పీ గుండాట ఆడి, ఉట్టి కొట్టారు.

News January 14, 2026

పామిడిలో పండగపూట విషాదం

image

పామిడిలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వెంగమ నాయుడు కాలనీకి చెందిన కువకుడు ద్వారక గజిని పట్టణ శివారులోని 44 హైవేపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 14, 2026

JNTU ACEA క్యాంపస్ ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబర్ నెలలో నిర్వహించిన M.Tech 2-1 (R21), MCA 1-1, 2-1 (R20) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వసుంధరతో కలిసి విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో HODలు రామశేఖర్ రెడ్డి, అజిత, కళ్యాణి రాధా, భారతి, జరీనా, కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు.