News May 25, 2024

లుంగీలో ప్రిసైడింగ్ ఆఫీసర్.. BJP అభ్యంతరం

image

బెంగాల్‌లోని బాగ్ముండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్ లుంగీలో రావడం వివాదాస్పదమైంది. ఓ కమ్యూనిటీ ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఆయన లుంగీలో వచ్చారని BJP అభ్యర్థి జ్యోతిర్మయి సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తనకు స్కిన్ ప్రాబ్లమ్ ఉందని, అందుకే లుంగీలో వచ్చానని ఆ అధికారి వివరించారు. అయినా జ్యోతిర్మయి వినకపోవడంతో TMC, BJP కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

Similar News

News November 11, 2025

నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

image

1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (ఫొటోలో)
1917: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్.రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకట‌రమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం

News November 11, 2025

VER అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: చంద్రబాబు

image

AP: శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విశాఖ ఎకానమిక్ రీజియన్(VER) అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. స్టేట్ హెల్త్ కేర్ పాలసీతో మెడికల్ టూరిజంను లింక్ చేయాలని సీఎం తెలిపారు.

News November 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.