News May 25, 2024

గూగుల్ ఫౌండర్ భార్యతో మస్క్ బంధం: NYT

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై న్యూయార్క్ టైమ్స్(NYT) సంచలన కథనం ప్రచురించింది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ భార్య నికోల్ షానన్‌తో ఆయన వివాహేతర సంబంధం నెరిపారని పేర్కొంది. ‘2021లో న్యూయార్క్‌లో నికోల్ పుట్టినరోజు వేడుకలకు హాజరైన సందర్భంగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ ఏడాది డిసెంబరు నాటికి అది శారీరక సంబంధంగా మారింది’ అని పేర్కొంది. 2022లో సెర్జీ దంపతులు విడాకులు తీసుకున్నారు.

Similar News

News October 26, 2025

నల్లరంగు వల్ల బైకును గుర్తించలేకపోయా: డ్రైవర్

image

AP: రోడ్డుపై పడిన <<18102090>>బైక్<<>> నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెప్పాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపకుండా బైకుపై నుంచి బస్సును పోనిచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.

News October 26, 2025

ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

image

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్‌, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్‌ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.

News October 26, 2025

విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తప్పిన ప్రమాదం

image

సౌదీ అరేబియాకు చెందిన SV340(Boeing 777-300) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జెడ్డా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ పక్షుల రక్తపు మరకలు అంటుకున్నాయి. ముందరి భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సేఫ్టీనే అని పైలట్ నిర్ధారించుకుని ల్యాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు గుర్తించారు. పక్షులు ఇంజిన్‌లోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.