News May 25, 2024

డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా సరే వదలొద్దు: CM రేవంత్

image

TG: గంజాయి, డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా సరే.. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. డ్రగ్స్ అమ్మాలన్నా, ఆ పేరు ఎత్తాలన్నా భయపడేలా చేయాలని తేల్చి చెప్పారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నారు. మాదకద్రవ్యాల సప్లై చైన్‌ను బ్రేక్ చేయాలని సమీక్షలో సూచించారు.

Similar News

News December 30, 2024

AP సీఎస్‌గా విజయానంద్ ఖరారు

image

AP కొత్త సీఎస్‌గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎస్‌ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

News December 30, 2024

APPLY NOW.. నెలకు రూ.1000

image

CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును JAN 10 వరకు పెంచారు. CBSEలో 70% మార్కులతో టెన్త్ పాసైన అమ్మాయిలు దీనికి అర్హులు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని ప్రోత్సహించేలా దీన్ని అమలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున రెండేళ్లు అందుతాయి. కుటుంబ వార్షికాదాయం ₹8లక్షలలోపు ఉండాలి. 11వ తరగతి పూర్తైన వారు మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. దరఖాస్తు కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News December 29, 2024

ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో రానున్న 5 రోజులు ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. రేపు 17-30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.