News May 26, 2024
రోహిత్ శర్మను దాటేసిన బాబర్ ఆజమ్

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్(3,987) రెండో స్థానానికి చేరారు. ఇప్పటివరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను (3,974) వెనక్కి నెట్టారు. మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ(4,037) కొనసాగుతున్నారు. 4, 5 స్థానాల్లో వరుసగా స్టిర్లింగ్ (3,589), గప్తిల్ (3,531) ఉన్నారు.
Similar News
News January 3, 2026
నల్లమల సాగర్‌కు రేవంత్ పరోక్ష అంగీకారం: హరీశ్‌రావు

నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లకు కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిపి <<18742119>>కమిటీ<<>> ఖరారు చేసినట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘3నెలల్లో నీటి పంపకాలు పూర్తి చేయడమంటే 3 నెలల్లో నల్లమల సాగర్‌ను ఆమోదించడమే. ఇందుకు AP పెట్టిన టెండర్ గడువు తీరాకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అంటే రేవంత్ సర్కార్ ఆ ప్రాజెక్టును పరోక్షంగా అంగీకరిస్తోందని అర్థమవుతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
కూనంనేని క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్

TG: PM మోదీకి <<18744541>>MLA కూనంనేని<<>> సాంబశివరావు క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘దేశంలో కమ్యూనిజం కనుమరుగవడానికి ఇలాంటి భాషే కారణమనిపిస్తోంది. అసెంబ్లీలో అలాంటి భాషకు స్థానంలేదు. ప్రభుత్వం, స్పీకర్ ఖండించకుండా మర్యాదని మరిచి వారి మిత్రపక్షాన్ని సమర్థించారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుంటే.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ రాజకీయాలు దుర్భాషల దగ్గరే ఆగిపోయాయి’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
కాంటాక్ట్ నేమ్‌తో కాల్స్ వస్తున్నాయా? No Tension

ఈ మధ్య సేవ్ చేయని ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చినా స్క్రీన్‌పై నేమ్ కన్పిస్తోందా? స్కామర్స్, స్పామర్స్‌కు చెక్ పెట్టేలా CNAP ఫీచర్‌ను ట్రాయ్ 2025 OCT నుంచి టెస్ట్ చేస్తోంది. ఈ కాలింగ్ నంబర్ ప్రజెంటేషన్ ఫీచర్‌ను MAR31 లోపు అమలు చేయనుంది. కనెక్షన్ టైంలో ఇచ్చే వివరాలతో టెలికం కంపెనీలు పేర్లు డిస్ప్లే చేస్తాయి. Spamగా Report చేస్తే డేటా అప్డేట్ అవుతుంది. ఇక True Caller లాంటి యాప్స్ అవసరం ఉండదు.Share It


