News May 26, 2024

ప్రతిపక్ష పార్టీపై రిషి సునాక్ విమర్శలు

image

యూకేలో జనరల్ ఎలక్షన్స్‌కి కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో PM రిషి సునాక్ ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీకి ఎలాంటి ప్రణాళిక లేదని, వారు గెలిస్తే దేశానికే ప్రమాదం అని అన్నారు. అందరి కుటుంబాలు డేంజర్‌లో పడతాయంటూ ట్వీట్ చేశారు. దేశ భద్రత కోసం తాము సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటామని, కానీ లేబర్ పార్టీ ఏమీ చేయదని పేర్కొన్నారు. కాగా జులై 4న అక్కడ ఎలక్షన్స్ జరగనున్నాయి.

Similar News

News February 4, 2026

గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

image

ప్రెగ్నెన్సీలో మహిళలు రోజుకి 3.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, హైబీపీ సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరీ తక్కువ ఉప్పు తీసుకుంటే బలహీనత, అలసట, నీరసం వంటివన్నీ వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News February 4, 2026

నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ (<>NML<<>>)లో 22 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(FEB 6) ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.36,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nml.res.in/

News February 4, 2026

OTTలోకి వచ్చేసిన హిట్ మూవీ

image

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా.. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.