News May 26, 2024
పరవాడలో యువకుడు ఆత్మహత్య

పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్‌తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.
Similar News
News July 6, 2025
గిరి ప్రదక్షిణ: పార్కింగ్ ప్రదేశాలివే-2

➣అడవివరం నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచకు వచ్చే వారు వాహనాలను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పెట్టి కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవాలి
➣ వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చే భక్తులు సింహపురి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలైన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో వాహనాలు నిలపాలి.
News July 6, 2025
విశాఖలో రేపు P.G.R.S.

విశాఖలో కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం P.G.R.S. నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉదయం 9.30కు P.G.R.S. ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు. కాల్ సెంటర్ 1100ను సంప్రదించి కూడా ప్రజలు వినతులను నమోదు చేసుకోవచ్చు.
News July 6, 2025
సింహాచలం గిరిప్రదక్షిణ: పార్కింగ్ స్థలాలు ఇవే-1

తొలి పావంచా వద్దకు వచ్చే వారి వాహనాలు అడవివరం జంక్షన్, సింహపురి కాలనీ RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో పార్కింగ్ చెయ్యాలి. హనుమంతవాక వైపు నుంచి వచ్చే భక్తులు ఆదర్శనగర్, డైరీ ఫారం జంక్షన్, టి.ఐ.సి పాయింట్, ఆరిలోవ లాస్ట్ బస్సు స్టాప్ మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డంపింగ్ యార్డ్ జంక్షన్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి అనంతరం దేవస్థానం ఉచిత బస్సుల్లో అడవివరం న్యూ టోల్గేట్ వద్దకు చేరుకోవాలి.