News May 26, 2024
21MP స్థానాల్లో మహిళలే నిర్ణేతలు.. గెలుపును ఎవరికి కట్టబెట్టారో?

AP: ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో 21 లోక్‌సభ స్థానాల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. శ్రీకాకుళంలో 47,236, గుంటూరులో 39,959, విశాఖలో 37,685 ఓట్లు అధికంగా నమోదయ్యాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు, హిందూపురం పార్లమెంట్ సీట్లలో మాత్రమే పురుషులు ఎక్కువగా ఓటేశారు. అత్యధికంగా నమోదైన మహిళల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయనేది ఆసక్తికరంగా మారింది. తమకే వేశారని వైసీపీ, కూటమి నేతలు ధీమాగా ఉన్నారు.
Similar News
News April 20, 2026
GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా
News April 20, 2026
అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
News April 20, 2026
అమెరికా వార్‌షిప్స్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

US తమ <<19693927>>నౌకను<<>> స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ దేశ యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరో రెండు రోజులు సీజ్‌ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దాడులు జరగడంతో డీల్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చమురు ధరలు సైతం భగ్గుమంటున్నాయి. WTI క్రూడ్ $90, బ్రెంట్ క్రూడ్ $96 డాలర్లకు చేరింది.


