News May 26, 2024
5 దశల్లో 50 కోట్ల మంది ఓటేశారు: EC

తొలి 5 దశల ఎన్నికల్లో 76.41 కోట్ల మందికిగాను 50.72 కోట్ల మంది ఓటు వేసినట్లు EC తెలిపింది. APR 19న 102 MP స్థానాల్లో 11 కోట్లు, 26న 88 పార్లమెంట్ సీట్లలో 10.58 కోట్లు, మే 7న 94 స్థానాల్లో 11.32 కోట్లు, 13న 96 సీట్లలో 12.25 కోట్లు, 20న 49 సెగ్మెంట్లలో 5.57 కోట్ల ఓట్లు నమోదయ్యాయని వెల్లడించింది. గణాంకాల వెల్లడిలో ఆలస్యం లేదని, పోలింగ్ సమాచారం ఎప్పటికప్పుడు యాప్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
Similar News
News January 13, 2026
భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

TG: వేసవిలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటి ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి అది 2.50 లక్షల కేసులకు పెరగొచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు అన్ని బ్రూవరీలకు లక్ష్యాలను నిర్దేశించింది. కాగా ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరి కిరణ్ బ్రూవరీలను సందర్శించి బీర్, ఇతర మద్యం ఉత్పత్తిపై సూచనలు ఇచ్చారు.
News January 13, 2026
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

<
News January 13, 2026
కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్

TG: జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కూతురుగా ఆమె చేస్తున్న విమర్శలపై BRS స్పందించాలన్నారు. మహిళా అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని, అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.


