News May 26, 2024
కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరు వ్యవహరించొచ్చు?

✒ 18 ఏళ్లు నిండిన వ్యక్తులను తమ ఏజెంట్లుగా అభ్యర్థులు నియమించుకోవచ్చు.
✒ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అనుమతి ఉంటుంది.
✒ భారత పౌరసత్వం ఉన్న ఎన్నారైలకు కూడా అభ్యంతరం ఉండదు.
✒ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి గన్‌మెన్లను వదులుకుంటే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
✒ కౌంటింగ్ హాల్‌లో టేబుళ్లకు అనుగుణంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
Similar News
News February 17, 2026
నటికి చేదు అనుభవం.. వాష్‌రూమ్‌లో వీడియో తీసి బ్లాక్‌మెయిల్

ఓ కన్నడ టీవీ నటికి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్‌కు హాజరవగా అక్కడి వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి ఆమె వీడియోను రహస్యంగా చిత్రీకరించాడు. దానిని ఇన్‌స్టాలో పంపి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 17, 2026
ఏఐ సాయంతో పిటిషన్లు.. సీజేఐ ఆందోళన

న్యాయవ్యవస్థలో ఏఐ వాడకంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు న్యాయవాదులు పిటిషన్లను ఏఐ సాయంతో రూపొందిస్తున్నారని పేర్కొంది. కల్పిత కేసులు/చట్టాలు, ఉనికిలో లేని జుడీషియల్ కోట్స్‌ను సమర్పిస్తున్నారని తెలిపింది. దీనివల్ల న్యాయ ప్రక్రియ సమగ్రత, నైతికతకు ముప్పు కలుగుతుందని, వృత్తిపరమైన సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ రంగంలో ఏఐ వినియోగంపై నియంత్రణ అవసరమంది.
News February 17, 2026
తిరుపతి SVIMSలో ఉద్యోగాలు

తిరుపతిలోని <


