News May 26, 2024
లారీ ఢీకొట్టి బాలుడి మృతి

భద్రాచలానికి చెందిన బాలుడు హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ITCలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం.వెంకటగోపి కుటుంబీకులతో HYD కూకట్‌పల్లిలో ఓ గృహ ప్రవేశానికి వచ్చారు. శనివారం స్వర్ణగిరి ఆలయానికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో వేదశ్రీ, పూజిత్‌రామ్‌కు వాంతులు కావడంతో కారు పక్కకు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ కొడుకు పూజిత్‌రామ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అక్కడికక్కడే మృతిచెందాడు.
Similar News
News January 12, 2026
ఖమ్మం: మున్సిపాలిటీల గెలుపుపై మంత్రుల ఫోకస్

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఏదులాపురంలో అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంలో ఒక్కో వార్డుకు ఐదుగురి చొప్పున జాబితా తయారీకి కసరత్తు సాగుతోంది.
News January 11, 2026
రూ.547 కోట్ల సైబర్ మోసం.. 17 మంది అరెస్టు

కాల్ సెంటర్లు, ఏపీకే ఫైళ్లు, ఓటీపీల ద్వారా అమాయకులను బురిడీ కొట్టించి రూ.547 కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో సీపీ సునీల్ దత్ వివరాలు వెల్లడిస్తూ.. ఈ ముఠా విదేశీ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి మోసాలకు పాల్పడిందని తెలిపారు. నిందితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, వారి ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 11, 2026
మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యం: మంత్రి తుమ్మల

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రి స్వగృహంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు


