News May 26, 2024
‘అఖండ 2’పై క్రేజీ రూమర్ వైరల్?

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న ‘అఖండ 2’ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం మరో 2 నెలల్లో సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సమాచారం. షూటింగ్ కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాలను మూవీ యూనిట్ పరిశీలించినట్లు టాక్. దక్షిణ భారతదేశ గొప్పతనాన్ని చూపించే సీన్స్ ఈ చిత్రంలో ఉంటాయట. బోయపాటి శ్రీను తెరకెక్కించనున్నారు. నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 15, 2026
దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో గుర్తుచేశారు.
News January 15, 2026
NTVపై చర్యలకు కారణం ఇదేనా?

TG: మంత్రి, ఓ మహిళా IAS అధికారికి సంబంధం ఉందని <<18856335>>NTV<<>>, పలు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తతో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా హోదాలు చెప్పి పరోక్షంగా ఆమె పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసింది. ఆ వార్తను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేయడంతో సర్కారు.. సిట్ ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చింది. NTV రిపోర్టర్లను అరెస్టు చేసింది.
News January 15, 2026
సూర్య మూవీకి రూ.85 కోట్ల OTT డీల్!

హీరో సూర్య, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.85 కోట్లకు OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తోంది. సూర్య కెరీర్‌లోనే ఇది అత్యధికమని సమాచారం. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య లాస్ట్ మూవీ ‘రెట్రో’ పెద్దగా ఆకట్టుకోకపోయిన మార్కెట్‌లో డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం.


