News May 26, 2024
స్కూల్ విద్యార్థులకు ఏటా రెండు సార్లు హెల్త్ చెకప్

TG: అన్ని స్కూళ్లూ ఏటా రెండుసార్లు విద్యార్థులకు కచ్చితంగా హెల్త్ చెకప్ చేయించాలని విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొంది. PHC నిపుణులతో చెకప్‌లు చేయించి, ఏవైనా రిఫరల్ కేసులుంటే స్థానిక ఏరియా ఆస్పత్రులకు పంపాలని సూచించింది. స్టూడెంట్స్ హెల్త్ కార్డులను ప్రాపర్‌గా మెయింటెయిన్ చేయాలని తెలిపింది. అలాగే విద్యార్థుల హాజరు 90% ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
Similar News
News January 12, 2026
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 16 ఫిర్యాదులు

తూ.గో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 16 ఆర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ప్రజల నుంచి స్వయంగా ఆర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.
News January 12, 2026
చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

AP: జగన్ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్ అవుతుందా? జగన్ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.
News January 12, 2026
Q3 ఫలితాలు ప్రకటించిన TCS.. భారీగా డివిడెండ్

టీసీఎస్ Q3 ఫలితాలను ప్రకటించింది. FY 2025-26 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.10,657 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో(Q3-రూ.12,380) పోలిస్తే 14% నికరలాభం తగ్గినట్లు తెలిపింది. అయితే ఆదాయంలో మాత్రం 5శాతం వృద్ధితో రూ.67,087 కోట్లకు చేరింది. 11,151 మంది ఉద్యోగులు తగ్గిపోగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్‌పై రూ.57 చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.


