News May 26, 2024
భర్త అప్పు చెల్లించలేదని భార్య అపహరణ!

TG: భర్త అప్పు చెల్లించలేదని బాకీ ఇచ్చినవారు భార్యను కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సూరారం సుదర్శన్ నగర్‌లో జరిగింది. మాగంటి లక్ష్మణరావు తెలిసినవారి దగ్గర అప్పు చేశాడు. ఎంతకీ తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు లక్ష్మణ్ ఇంటికి వచ్చి ఆయన భార్యను కిడ్నాప్ చేశారు. అప్పు చెల్లించేవరకూ విడిచిపెట్టమని బెదిరించారు. కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ఆమెను విడిపించారు.
Similar News
News January 9, 2026
కొత్త బీడీ పొగాకు రకం ‘ABD 132’.. దీని ప్రత్యేకత ఏమిటి?

ABD 132 బీడీ పొగాకు రకాన్ని నంద్యాల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ రకం పంటకాలం 195 నుంచి 210 రోజులుగా ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేయడానికి ఈ రకం అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర బీడీ పోగాకు రకాలతో పోలిస్తే దీని పొగలో హానికర అంశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.
News January 9, 2026
విద్యుత్ ఛార్జీలపై సీఎం గుడ్ న్యూస్

AP: కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో యూనిట్ విద్యుత్ ₹5.19గా ఉండేదని, దాన్ని ₹4.90కి తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు. మార్చి నాటికి మరో 10 పైసలు, మూడేళ్లలో ₹1.19 తగ్గించి యూనిట్ ₹4కే అందిస్తామన్నారు. 2019-24 నాటి ట్రూఅప్ ఛార్జీల భారం ₹4,498 కోట్లను ప్రభుత్వమే భరించే నిర్ణయాన్ని క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం గందరగోళ నిర్ణయాలు అమలు చేసిందని విమర్శించారు.
News January 9, 2026
కుబేర యోగాన్ని పొందడం ఎలా?

జాతకంలో ఈ యోగం లేకపోయినా కొన్ని పరిహారాలతో కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు. రోజూ ఇంట్లో ఉత్తర దిశలో ‘కుబేర యంత్రం’ ఉంచి పూజిస్తే ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి. కుబేర ముద్రను ధ్యానంలో ఉపయోగించడం, లక్ష్మీ కుబేర మంత్రాన్ని 108 సార్లు పఠించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం, పేదలకు దానధర్మాలు చేయడం ద్వారా కుబేర శక్తిని ఆకర్షించవచ్చు. మనసులో దృఢ సంకల్పం, శ్రమ ఉంటే ఈ యోగం తప్పక ఫలిస్తుంది.


