News May 26, 2024
జట్టుతో అమెరికా వెళ్లని హార్దిక్ పాండ్య

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయల్దేరిన భారత జట్టు సభ్యుల్లో హార్దిక్ పాండ్య లేరు. భార్యతో విడాకుల రూమర్ల నేపథ్యంలో హార్దిక్ జట్టుతో వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న పాండ్య అక్కడి నుంచే నేరుగా అమెరికా వెళ్లి జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అటు వీసా ఆలస్యం కారణంగా విరాట్ కోహ్లీ కూడా అమెరికా వెళ్లలేదు.
Similar News
News January 11, 2026
₹1లక్ష జీతంతో 764 జాబ్స్.. ఇవాళే చివరి తేదీ

DRDO 764 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నిషియన్-A పోస్టుల భర్తీ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ఈ అర్ధరాత్రితో (11 JAN-26) ముగుస్తోంది. A పోస్టులకు SSC+ITI, కేటగిరీ Bకి BSc లేదా 3సం. డిప్లొమా విద్యార్హత. నెలకు ₹1లక్ష వరకు వేతనంతో పాటు HRA, TA, పిల్లల ఎడ్యుకేషన్, మెడికల్ తదితర బెనిఫిట్స్ ఉంటాయి. 18-28సం. మధ్య వయస్కులు అర్హులు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం DRDO అధికారిక సైట్ చూడండి.
Share It
News January 11, 2026
PSLV-C62 కౌంట్‌డౌన్ స్టార్ట్

AP: తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్‌లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది PSLVకి 64వ ప్రయోగం కాగా PSLV-DL వేరియంట్‌లో 5వ మిషన్. ఈ వాహక నౌక 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.
News January 11, 2026
పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

శీతాకాలంలో పసిపిల్లలు ఎక్కువగా జలుబుకు గురవుతారు. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం సులువవుతుందంటున్నారు నిపుణులు. శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు/ నీలం రంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. అలాగే శ్వాస వేగంగా తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


