News May 26, 2024
NIMS వైద్యులకు సీఎం అభినందనలు

TG: ఛాతీలో బాణం దిగి కొట్టుమిట్టాడిన యువకుడిని <<13317857>>రక్షించిన<<>> నిమ్స్ వైద్యులను CM రేవంత్ ప్రశంసించారు. ‘గిరిజన యువకుడు నంద ఛాతీలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నిపుణతతో తొలగించి నిండు ప్రాణం కాపాడిన వైద్యులకు నా అభినందనలు. ప్రజల్లో నిమ్స్ ఆస్పత్రిపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించారు. భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా సేవలు అందించి, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలి’ అని Xలో CM పోస్ట్ చేశారు.
Similar News
News April 18, 2026
ఏపీలో ప్రతిపక్షమేది?

ఏపీలో ఉన్న మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోగా.. జగన్ పొత్తు లేకపోయినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ BJPకి వ్యతిరేకంగా ఉన్నా దానికి పెద్దగా ప్రజల మద్దతు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సౌత్ రాష్ట్రాలన్నీ ఒక దారిలో ఉంటే ఏపీది మరో దారి. మరి ఏపీలో ప్రతిపక్షమేది?
News April 18, 2026
డీలిమిటేషన్.. జాతీయ మీడియాలో రేవంత్ పేరు!

131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లుల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా సీఎంల కంటే ముందుగా రేవంతే ఈ అంశాన్ని లేవనెత్తారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్‌కు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని విమర్శించారు. హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ జరగాలని సరికొత్త పాయింట్‌ను తెరపైకి తెచ్చారు.
News April 18, 2026
పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’కు ఓటీటీ కష్టాలు?

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం ‘స్లమ్ డాగ్’పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ముగిసినా రిలీజ్ ప్రకటన వెలువడటం లేదు. దీనికి ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడమే కారణమని సమాచారం. ప్రస్తుతం పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. డీల్ పూర్తయ్యాకే విడుదల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


