News May 26, 2024
చిత్తూరు: సహకార ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సహకార వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలు చేయాలన్న హైకోర్టు తీర్పుతో జిల్లాలోని 76 సహకార సంఘాల్లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది. వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచింది. దీన్ని సహకార సంస్థలకు వర్తింపజేయలేదు. ఈ మేరకు సహకార ఉద్యోగులకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.
Similar News
News July 7, 2025
తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరు మృతి

తిరుపతి కపిలతీర్థం వద్ద సోమవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. భక్తులు, యాచకులపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ యాచకుడు మృతి చెందగా, మరో ఇద్దరు భక్తులు కోలుకుంటున్నారు. సైకో కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 7, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదంట..!

చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 9896 Mtsల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 10514 mtsల యూరియా నిల్వ చేయగా 6032 mtsలను ఇప్పటి వరకు రైతులు తీసుకెళ్లారు. 4200 Mts యూరియా అందుబాటులో ఉంది. గోడౌన్‌లో 1852 Mts, ప్రైవేట్ డీలర్స్ దగ్గర 1300Mts, RSKలలో 738 Mts, కంపెనీ గోడౌన్‌లో 300Mts మేర నిల్వ ఉండటంతో యూరియా కొరత రాదని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ Way2Newsకు తెలిపారు.
News July 7, 2025
బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద భక్తులపై హిజ్రాల దాడి

బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వస్తున్న భక్తులపై హిజ్రాలు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన దేవరాజు కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనం కోసం ఆటోలో వచ్చారు. బోయకొండ వద్ద ఆటోలు ఆపిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు అడిగినంత ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు. ఈ దాడిలో ఐదుగరు గాయపడగా.. వారు చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.