News May 26, 2024
Jr.ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్: విరాట్ కోహ్లీ

టాలీవుడ్‌లో తనకు జూ.NTR మంచి ఫ్రెండ్ అని భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చెప్పారు. ‘ఓ యాడ్‌లో కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా. RRRలో NTR నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు. ‘నాటు నాటు’ పాటకు డాన్స్ ఎంతో ఆకట్టుకుంది. నా భార్య అనుష్కతో కలిసి ఆ పాటకు రీల్స్ చేశా. ఈ సినిమాకు ఆస్కార్ వచ్చిందని తెలిసి వెంటనే ‘నాటు నాటు’ పాటకు గ్రౌండ్‌లో డాన్స్ వేశా’ అని విరాట్ చెప్పారు.
Similar News
News July 6, 2025
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్

రెండో టెస్టులో భారత్ సంధించిన భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమని, పిచ్ తీరును బట్టి తమ బ్యాటర్లు ఆడతారని ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అన్నారు. తామేమీ పిచ్చోళ్లం కాదని గెలుపు కుదరకపోతే డ్రా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ‘ఒక్క రోజులో 550కుపైగా పరుగులు చేయడం అసాధ్యం. కానీ మా బ్యాటర్లు మాత్రం పోరాటం ఆపరు’ అని ఆయన స్పష్టం చేశారు.
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <