News May 26, 2024
నిప్పుల కొలిమిలా నిర్మల్..రాష్ట్రంలోనే అత్యధికం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొట్టడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అత్యధికంగా నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రికార్డు స్థాయిలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్‌లోని ముజిగిలో 45.2, నిర్మల్ జిల్లా కడెంలో 44.6, నిర్మల్ జిల్లా తానుర్‌లో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని చాప్రలలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News July 6, 2025
ADB: యువతులను వేధిస్తున్న యువకుడిపై కేసు

యువతులు, మహిళలను వేధిస్తున్న యువకుడి పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అనీస్ అనే యువకుడు స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న మహిళలు, యువతులను వేధించడంతో అతనిపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సమాచారం అందుకున్న షీటీం సిబ్బంది రైల్వే స్టేషన్ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
News July 6, 2025
ADB: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్థులకు HYDలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కొరకు
https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ADB బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
News July 5, 2025
సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ADB ఎస్పీ

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని సూచనలు చేశారు. సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం నిర్వహించే పరేడ్‌లో పాల్గొని నిర్వహించే కవాతులో పరిపూర్ణత చెందాలన్నారు.