News May 26, 2024

విశాఖలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 

image

విశాఖ నగరంలో శనివారం అర్ధరాత్రి వరకు పోలీసులు పలుచోట్ల విస్తృతంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్వయంగా పర్యవేక్షించారు. జోన్-1 పరిధిలో ఫోర్ వీలర్స్-17, టూ వీలర్స్-148, ఆటోలు-17, జోన్-2 పరిధిలో టూ వీలర్స్-175, ఆటోలు-10, ఫోర్ వీలర్స్-14, ఒక కమర్షియల్ వాహనంపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 22, 2025

జువైనల్ హోమ్ ఘటనపై స్పందించిన హోం మంత్రి

image

విశాఖలోని జువైనల్ హోమ్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, విశాఖ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాలికల ఆరోపణలపై ఆరా తీశారు. మహిళా పోలీస్ అధికారి, తహశీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ని ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమని తెలితే కఠిన చర్యలు తప్పవన్నారు.

News January 22, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

image

అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు భార్యాభర్తలని పోలీసులు తెలిపారు. ఫార్మాసిటీలో విధులు నిర్వహిస్తున్న మన్మధరావు తన భార్య అరుణ్ కుమారీతో కలిసి అగనంపూడి వద్ద డొంకాడ గ్రామంలో అద్దెకు ఉంటున్నట్లు సీఐ వివరాలు వెల్లడించారు. బ్యాంకు పనినిమిత్తం బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని సీఐ తెలిపారు.

News January 22, 2025

అల్లూరి: బడి కోసం ఊరంతా ఏకమైంది..!

image

చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరంలో పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో పాఠశాల భవనం లేక బడి ఈడు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.