News May 26, 2024

మరికాసేపట్లో IPL ఫైనల్.. వాతావరణం ఎలా ఉందంటే?

image

కాసేపట్లో కేకేఆర్, SRH మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చెన్నై చెపాక్ స్టేడియంలో వర్షం కురిసే అవకాశం తక్కువేనని అక్యూవెదర్ తెలిపింది. కాగా నిన్న ఇదే సమయానికి స్టేడియంలో వర్షం కురిసింది. ఒకవేళ ఇవాళ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా స్టేడియానికి తరలివస్తున్నారు.

Similar News

News April 15, 2026

గూగుల్ డేటా సెంటర్‌కు ‘డీమ్డ్ డిస్కం’ హోదా.. అసలేంటిది?

image

APలో 300 మెగావాట్ల కెపాసిటీకి మించి ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు ‘డీమ్డ్ డిస్కం’ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత విశాఖ గూగుల్‌ డేటా సెంటర్‌కు ఈ అవకాశం కల్పించింది. త్వరలోనే ఉత్తర్వులివ్వనుంది. రాష్ట్రంలో ఈ హోదా పొందనున్న తొలి ప్రైవేట్ సంస్థ ఇదే. ఇకపై ఆ కంపెనీ ఎలక్ట్రిసిటీ కొరత లేకుండా ఎక్కడినుంచైనా నేరుగా విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. సొంతంగా ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటుచేసుకోవచ్చు.

News April 15, 2026

CBSE టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు?.. విద్యార్థుల ఎదురుచూపులు

image

సీబీఎస్‌ఈ టెన్త్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిన్నే విడుదల అవుతాయని జాతీయ మీడియాలో ప్రచారం జరగడంతో అధికారిక వెబ్‌సైట్‌ను పదేపదే చెక్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. రిజల్ట్స్‌పై కచ్చితమైన డేట్ అండ్ టైమ్ ప్రకటించాలని విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

News April 15, 2026

డీలిమిటేషన్.. సరిహద్దులను ఎలా నిర్ణయిస్తారు?

image

డీలిమిటేషన్‌తో దేశంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త, పాత నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. నదులు, కొండలు వంటి సహజ సరిహద్దులు, జిల్లాల బార్డర్స్, రవాణా, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి సీటులో సమాన సంఖ్యలో జనాభా ఉండేలా, అసెంబ్లీ సెగ్మెంటు ఏదో ఒక పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా చూస్తుంది. SC, ST జనాభా ఎక్కువున్న చోట రిజర్వేషన్ కల్పిస్తుంది.