News May 26, 2024

హార్ట్ బ్రేకింగ్.. SRH 77 రన్స్‌కే 7 వికెట్లు

image

KKRతో ఫైనల్లో SRH పీకల్లోతు కష్టాల్లో పడింది. 77 రన్స్‌కే 7 కీలక వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 2, హెడ్ 0, త్రిపాఠి 9, మార్క్రమ్ 20, నితీశ్ 13, షాబాజ్ 8, సమద్ 4 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. దీంతో SRH అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Similar News

News November 4, 2025

రేపే కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలంటే?

image

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానమాచరించి, శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నదీ స్నానం చేయలేనివారు గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుంది. తులసి పూజతో పాటు 365 వత్తులతో దీపం వెలిగించాలి. శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం’ అని అంటున్నారు.
☞ కార్తీక పౌర్ణమి గురించి మరిన్ని విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 4, 2025

కార్తీక పౌర్ణమి: ఉపవాసం ఎలా ఉండాలి?

image

‘కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. అది వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చు. వాయుపురాణం ప్రకారం.. పెసరపప్పు-బియ్యం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా స్వీకరించవచ్చు. అయితే, ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మాటిమాటికి వద్దు’ అని పండితులు సూచిస్తున్నారు.

News November 4, 2025

మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

image

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.