News May 26, 2024
పలు రైళ్ల దారి మళ్లింపు

TG: నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు <<13319560>>తప్పడంతో<<>> పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు పగిడిపల్లి-కాజీపేట-వరంగల్-కొండపల్లి మీదుగా విజయవాడ చేరుకుంటాయి. విజయవాడ-లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ గంట ఆలస్యంగా బయలుదేరనుంది. గూడ్స్ పట్టాలు తప్పిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Similar News
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News March 14, 2025
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.
News March 14, 2025
WPL: ఈ సారైనా కప్పు కొట్టేనా?

WPL 2025లో కప్పు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి. మూడో సారి ఫైనల్ చేరిన DC జట్టు ఈ సారైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు MI రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం ఆ జట్టుకు సానుకూలంగా ఉంది. మరి రేపు జరిగే తుది పోరులో DC ఇదే జోరు కొనసాగిస్తుందో డీలా పడుతుందో చూడాలి.