News May 26, 2024
IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్
KKRతో జరుగుతున్న ఫైనల్లో 113 రన్స్‌కే పరిమితమైన SRH.. IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. 2013లో ముంబైపై చెన్నై 125/9 రన్స్ చేసింది. 2017లో పుణేతో మ్యాచులో ముంబై 129/8 పరుగులకే పరిమితమైంది. అయితే ఛేజింగ్‌కు దిగిన పుణేను ముంబై 128/6 రన్స్‌కే కట్టడి చేసి ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.
Similar News
News January 27, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ ఆ హీరోతో చేస్తా: అనిల్ రావిపూడి
వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సక్సెస్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఒకవేళ తనకు అవకాశం వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ సల్మాన్ ఖాన్‌తో చేస్తానని చెప్పారు. ఈ కథ ఆయనకు బాగా సూట్ అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఇప్పటికే రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
News January 27, 2025
అంతా ఏకపక్షమైనప్పుడు JPC ఎందుకు?: విపక్షాలు
వక్ఫ్ సవరణ బిల్లుపై JPCలో విపక్షాల ప్రతిపాదనలను తిరస్కరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. NDA సభ్యుల 14 ప్రతిపాదనలను ఆమోదించి, 44 క్లాజుల్లో తాము ప్రతిపాదించిన వందలాది సవరణలను అజెండా ప్రకారం పక్కనపెట్టేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమిటీ ఛైర్మన్ పాల్ ప్రజాస్వామ్యానికి బ్లాక్‌లిస్టర్ అని మండిపడుతున్నాయి. అంతా ఏకపక్షమైనప్పుడు JPC ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.
News January 27, 2025
నవధాన్యాలతో లోకేశ్ చిత్రం.. థాంక్స్ చెప్పిన మంత్రి
AP: లోకేశ్ చేపట్టిన యువగళం ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని తేజశ్రీ అనే ఆర్టిస్ట్ నవ ధాన్యాలతో ఆయన చిత్రాన్ని వేశారు. ఆ యాత్ర చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా 6*4 అడుగుల చిత్రాన్ని 3 రోజుల్లో పూర్తి చేయడం గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. అద్భుతమైన కళాఖండం రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీని తయారీకి ఆమె చేసిన కృషి, చూపిన నిబద్ధతను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.