News May 26, 2024

మరోసారి హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్

image

AP: హత్యాయత్నం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి ఘటనలో పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జూన్ 5 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం తీర్పిచ్చింది.

Similar News

News November 11, 2025

హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం: సీఎం చంద్రబాబు

image

AP: వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ హజ్ యాత్రికులకు రూ.లక్ష చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. కడప, విజయవాడలో హజ్ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటామన్నారు.

News November 11, 2025

స్థిరాస్తి అమ్మకం సేవా పన్ను పరిధిలోకి రాదు: SC

image

స్థిరాస్తి అమ్మకాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావని SC స్పష్టం చేసింది. సహారా కంపెనీకి ‘ఎలిగెంట్ డెవలపర్స్’ 2002-05లో గుజరాత్, హరియాణా, MHలోని తన భూములను అవుట్‌రైట్ సేల్ చేసింది. అయితే ‘రియల్ ఏజెంటు’గా అమ్మినందున ₹10.28CR సర్వీస్ ట్యాక్స్ కట్టాలని DGCEI నోటీసులు ఇచ్చింది. వీటిని సంస్థ సవాల్ చేయగా CESTAT రద్దుచేసింది. దీనిపై సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై SC తాజా తీర్పు ఇచ్చింది.

News November 11, 2025

ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <>RITES<<>>) 7 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC,ST, PWBDలకు రూ.300. వెబ్‌సైట్: http://www.rites.com