News May 27, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* ఐపీఎల్-2024 విజేత KKR
* ఏపీలో కూటమిదే అధికారం: అమిత్ షా
* AP: పిన్నెల్లి హత్యకు టీడీపీ ప్రయత్నం: పేర్ని నాని
* TG: రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదం: ఉత్తమ్
* TG: సన్నబియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కామ్: KTR
* TG: జులైలో రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల
* TG: రేపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక

Similar News

News April 18, 2026

మొగల్తూరు: వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

image

మొగల్తూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని గుబ్బల మావుళ్లు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను నిత్యం వెంబడిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి, ఈనెల 14న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనిపై మొగల్తూరు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

News April 18, 2026

కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

image

ఇరాన్‌ను నాశనం చేసి హార్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్‌ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.

News April 18, 2026

అందుకే మ్యాచ్‌లకు రావట్లేదన్న డింపుల్ బ్యూటీ

image

PBKS యజమాని ప్రీతి జింటా గత సీజన్ వరకూ స్టేడియానికి వచ్చి తన జట్టుకు సపోర్ట్ చేసేవారు. అయితే ఈ సీజన్‌లో జట్టు విజయాలతో దూసుకెళ్తున్నా ఆమె స్టేడియంలో కనిపించకపోవడంతో SM వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నించారు. దీంతో ఆమె రిప్లై ఇచ్చారు. ‘చాలా కాలంగా పిల్లలకు దూరంగా ఉన్నా. ప్రస్తుతం వాళ్లకు సెలవులు. వారితో గడపడానికే మ్యాచ్‌లకు రావట్లేదు. త్వరలోనే స్టేడియంలో కనిపిస్తా’ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.