News May 27, 2024

IPL-2024 అవార్డ్స్

image

☛ ఆరెంజ్ క్యాప్-కోహ్లీ(741 రన్స్, RCB)
☛ పర్పుల్ క్యాప్-హర్షల్ పటేల్ (24 వికెట్లు, PBKS)
☛ ఫెయిర్ ప్లే అవార్డు – SRH
☛ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్-నితీష్ కుమార్ రెడ్డి (SRH)
☛ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (488 రన్స్, 17 వికెట్లు-KKR)
☛ ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్-మెక్‌గుర్క్ (DC)

Similar News

News January 9, 2026

ఆసిఫాబాద్‌‌లో మున్సిపల్ అభ్యర్థుల వేట

image

జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహుల బలాబలాలపై రహస్య సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీసీ, జనరల్ రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని కులాల వారీగా ఒక్కో వార్డు నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను సేకరిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే గెలుపు గుర్రాలుగా భావిస్తూ అడుగులు వేస్తున్నాయి.

News January 9, 2026

సంక్రాంతికి ఫ్రీ టోల్‌ లేనట్లే!

image

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్‌ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్‌ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.

News January 9, 2026

విమానాల తయారీలోకి అదానీ గ్రూప్

image

అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు చేయనున్నారు. ఫిక్స్‌డ్‌ వింగ్‌ ప్యాసింజర్‌ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్‌ యూనిట్‌ కానుంది. ఈ నెలాఖరున జరిగే ఏవియేషన్ షోలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.