News May 27, 2024
జూన్ 1న ‘ఇండియా’ కూటమి నేతల సమావేశం!

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానుండగా, అంతకుముందే జూన్ 1న ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారట. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం. మరోవైపు అదే రోజున ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఆయన ఆ తర్వాతి రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కోర్టులో సరెండర్ కావాల్సి ఉంది.
Similar News
News July 4, 2025
సెప్టెంబర్‌లో స్కిల్ పోర్టల్ ప్రారంభం: మంత్రి లోకేశ్

AP: స్కిల్ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో స్కిల్ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ రెడీ అవుతుంది’ అని Xలో పోస్ట్ చేశారు.
News July 4, 2025
కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం: వాతావరణ కేంద్రం

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత అరగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
News July 4, 2025
IIIT విద్యార్థుల జాబితా విడుదల

TG: 2025-26 విద్యా సంవత్సరానికి IIITలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్‌ఛార్జ్ వీసీ విడుదల చేశారు. 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 1,690 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులకు టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరగ్గా, 88శాతం సీట్లు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారికే దక్కాయి. ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. <