News May 27, 2024
వాట్సాప్‌లో ‘1 మినిట్ వాయిస్ స్టేటస్’ ఫీచర్

ఆండ్రాయిడ్, IOS యూజర్లకు వాట్సాప్ ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్స్- 1మినిట్ లాంగ్’ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఒక నిమిషం వరకు నిడివి ఉన్న వాయిస్ నోట్స్‌ను స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఆడియో అప్‌డేట్స్ ఎక్కువ షేర్ చేసుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. ప్రస్తుతం లేటెస్ట్ వెర్షన్స్ అప్‌గ్రేడ్ చేసుకున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే మిగతా వారికి అందుబాటులోకి రానుంది.
Similar News
News April 19, 2026
కాసేపట్లో వర్షం..

TG: సిరిసిల్ల, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సాయంత్రం వానలు పడతాయని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వర్షం పడొచ్చని పేర్కొన్నారు. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.
News April 19, 2026
మాత్రేకు గాయం.. CSKకు మరో షాక్ తప్పదా?

CSKను గాయాలు వెంటాడుతున్నాయి. ఎల్లిస్, ధోనీ, <<19663724>>ఖలీల్<<>> తర్వాత ఈ జాబితాలో ఆయుష్ మాత్రే చేరినట్లు తెలుస్తోంది. SRHతో మ్యాచులో ఆయన కండరాల గాయంతో ఇబ్బంది పడటంపై బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ స్పందించారు. ‘ఇది కచ్చితంగా తొడ కండరాల్లో చీలిక రావడమే. త్వరలో స్కాన్ చేస్తాం. దురదృష్టవశాత్తూ పరిస్థితి తీవ్రంగానే కనిపిస్తోంది’ అని చెప్పారు. దీంతో మాత్రే కొన్ని మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాల అంచనా.
News April 19, 2026
‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

AP: అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలకు వైద్య సాయం అందించేందుకు మంత్రి లోకేశ్ ‘ప్రాజెక్ట్ పునర్విక’ను ప్రకటించారు. చిన్నారి <<19682330>>పునర్వికకు<<>> ₹16Cr ఇంజెక్షన్ ఇస్తుండగా చూడటం తన జీవితంలోని భావోద్వేగ క్షణాల్లో ఒకటని Xలో <


