News May 27, 2024
❤️మనసులు గెలుచుకున్న SRH!

టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న SRH చివరి మెట్టుపై బోల్తా పడింది. IPL చరిత్రలో అత్యధిక స్కోర్(287), పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్(125), అత్యంత వేగంగా 150+ స్కోర్ ఛేదన.. ఇలా ఎన్నో రికార్డులను SRH తిరగరాసింది. అభిషేక్, హెడ్, క్లాసెన్ వీర బాదుడు కోసం మిగతా జట్ల ఫ్యాన్స్ సైతం SRH మ్యాచ్ కోసం ఎదురుచూసేవారు. విధ్వంసకర ఆటతీరుతో కమిన్స్ సేన మిగతా జట్లను భయపెట్టింది. FINALలో ఓడినా అభిమానుల మనసులు గెలుచుకుంది.
Similar News
News January 12, 2026
ఇరాన్‌లో ఇండియన్స్ అరెస్ట్.. స్పందించిన ఆ దేశ రాయబారి

ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక <<18832503>>అల్లర్లలో<<>> ఇండియన్స్‌ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారన్న వార్తల్ని భారత్‌లోని ఆ దేశ రాయబారి మహమ్మద్ ఫథాలీ ఖండించారు. వివిధ సోషల్ మీడియా ఖాతాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఇరాన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అధికారిక ప్రకటనలపైనే ఆధారపడాలని సూచించారు.
News January 12, 2026
PSLV-C62 ప్రయోగం

AP: ఇస్రో PSLV-C62 ప్రయోగం ప్రారంభమైంది. నిర్దేశిత సమయం ప్రకారం 10.18 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా అడ్వాన్స్‌డ్ భూపరిశీలన ఉపగ్రహం EOS-N1 సహా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలను పంపారు. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.
News January 12, 2026
వెనిజులాను ట్రంప్ ఏం చేయబోతున్నారు?

వెనిజులాను ఉద్ధరిస్తానన్న US అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తానే ఆ దేశానికి యాక్టింగ్ <<18833003>>ప్రెసిడెంట్<<>> అని ప్రకటించుకున్నారు. డ్రగ్స్‌ను బూచిగా చూపించి ఆయిల్ కంపెనీలను గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన కంపెనీలకే చమురు సరఫరా చేయాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తన చెప్పుచేతల్లో ఉండాలన్నారు. తాజా ప్రకటనతో ట్రంప్ ఇంకెన్ని ఆంక్షలు విధిస్తారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


