News May 27, 2024
పైడితల్లమ్మ దర్శనం టికెట్ ధర పెంపు

విజయనగరం పైడితల్లి అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్‌ను ఇటీవల రూ.25 నుంచి రూ.50కు పెంచారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రైవేటు వ్యక్తులు గర్భాలయం పూజలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆలయ అధికారులు కొట్టిపారేశారు. అలా ఏం జరగడం లేదని తేల్చి చెప్పారు.
Similar News
News January 11, 2026
VZM: ఆకాశమే హద్దు.. పతంగులతో పిల్లల ఆటలు

సంక్రాంతి పండగను పురస్కరించుకొని పిల్లల్లో పతంగులు ఎగరవేయాలనే ఉత్సాహం పెరిగింది. రంగురంగుల పతంగులు, మాంజా దారాల కొనుగోలులో పిల్లలు బిజీగా ఉన్నారు. మైదానాలు, ఇంటి టెర్రస్‌లు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. గాజు మాంజా వాడకూడదని విజయనగరం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. విద్యుత్ తీగల దగ్గర పతంగులు ఎగరవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
News January 11, 2026
VZM: 63 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(KGBV) మొత్తం 63 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-10, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-12, ANM-7, అటెండెర్-3, హెడ్ కుక్-1, ASST కుక్-2, వాచ్ ఉమెన్-1 ఉండగా.. టైప్-4లో వార్డెన్-4, పార్ట్ టైమ్ టీచర్-7, చౌకిదార్-5, హెడ్ కుక్-3 ASST కుక్-8 ఉన్నాయి. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.
News January 11, 2026
ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు: వైసీపీ

గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఐదు గిరిజన గ్రామాల ప్రజలను ట్రైబల్ అధికారులు పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది. సుమారు 100 కుటుంబాలు సమస్యలతో బాధపడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకొని మెడకు ఉరి తాళ్లు బిగించుకొని గిరిజనులు వినూత్న నిరసన చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంది. ‘ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు?’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.


