News May 27, 2024

వర్చువల్ క్రెడిట్ కార్డులు అంటే?

image

భౌతిక రూపం లేకుండా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే డిజిటల్ కార్డులే వర్చువల్ క్రెడిట్ కార్డులు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. సాధారణ కార్డుల్లాగే వీటికి కూడా నంబర్, CVV, వాలిడిటీ ఉంటుంది. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్డులు వన్ టైమ్ యూసేజ్ ఆప్షన్‌తో వస్తాయి. ఒకసారి వచ్చిన కార్డును 24-48hrs వరకు మాత్రమే వాడవచ్చు. కార్డు అవసరం లేనప్పుడు క్యాన్సిల్ చేయవచ్చు.

Similar News

News April 19, 2026

మూడు నెలల్లో 73,200 ఉద్యోగాలు ఉఫ్!

image

ఈ ఏడాదిలో తొలి మూడునెలల్లోనే 95 కంపెనీలు ఏకంగా 73,200 ఉద్యోగాల్లో కోత ప్రకటించినట్లు Layoffs.fyi వెల్లడించింది. ఏఐ వాడకం పెరగడం, కాస్ట్ కట్టింగే ఇందుకు కారణం. ఇందులో బడా కంపెనీలైన మెటా, ఒరాకిల్, స్నాప్, డిస్నీ కూడా ఉన్నాయి. ఒరాకిల్ దాదాపు 30వేల ఉద్యోగాలు కట్ చేసింది. ఇందులో భారత్‌లోనే 12వేల ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. ఇక మెటాలో 2000+ ఉద్యోగాలు పోగా డిస్నీ 1000 మందిని తొలగించింది.

News April 19, 2026

రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్

image

కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. రూ.799 (1.5gb/రోజుకు) ప్లాన్ రేటును ఏకంగా రూ.100 పెంచేసి రూ.899గా నిర్ణయించింది. అటు రూ.859 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. పెంచిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

News April 19, 2026

సెన్సస్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

image

AP: కేంద్రం చేపట్టిన జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు సూచించారు. సెన్సస్ సిబ్బందిమంటూ ఇళ్ల వద్దకు వచ్చి OTPలు అడిగితే చెప్పొద్దని, వేలిముద్రలు, ఐరిస్‌కు ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కాగా ప్రస్తుతం <<19674967>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> జరుగుతుండగా, మే 1 నుంచి జనగణన మొదలవనుంది.