News May 27, 2024

రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అరుదైన ఘనత

image

రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌(ISL)లో ప్రదర్శితమవుతున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ISL అంటే సినిమా రన్ అవుతుండగా అందులోని సన్నివేశాలు అర్థమయ్యేలా సైగలతో వివరిస్తారు. అమెజాన్ ప్రైమ్‌లో బధిరులు(మూగ, చెవిటి) చూసేందుకు వీలుగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఐపీఎల్‌లోనూ సైన్ లాంగ్వేజ్‌ను ఉపయోగించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 18, 2025

నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వినాయక్ నగర్‌లో మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్తారు. ZPHS వరకూ కాలినడకన ర్యాలీలో పాల్గొంటారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

News January 18, 2025

వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు?

image

TG: ఫిబ్రవరి చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎలక్షన్ కోడ్ లోపు పథకాల అమలు పూర్తి కాకపోతే అది ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే ఛాన్సుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచిస్తే ఏప్రిల్/మేలో ఎన్నికలు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

News January 18, 2025

గడ్డకట్టే చలి.. ఇండోర్‌లోనే ట్రంప్ ప్రమాణం

image

ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఇండోర్‌లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటోల్ భవనంలో ప్రమాణం చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో అతిథులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పారు. కాగా అర్కిటిక్ బ్లాస్ట్ వల్ల వాషింగ్టన్ డీసీలో 20న -12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.