News May 27, 2024
సీఎం అండతోనే సీఎస్ భూకబ్జాలు: బొండా ఉమా
AP: సీఎం జగన్ అండతోనే సీఎస్ జవహర్ రెడ్డి భూకుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ నేత బొండా ఉమా ఆరోపించారు. సీఎస్‌ను తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘తాడేపల్లి పెద్దలతో కలిసి సీఎస్ భూకబ్జాలకు పాల్పడ్డారు. భోగాపురం మండలంలో రూ.2 వేల కోట్ల భూకుంభకోణం చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 18, 2025
లవ్ యూ మిషెల్.. ఒబామా ట్వీట్
తన భార్య మిషెల్ ఒబామాతో విడాకులు తీసుకుంటున్నారని వస్తోన్న వార్తలకు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చెక్ పెట్టారు. ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్. మీరు నా జీవితంలో హాస్యం, ప్రేమ, దయతో నింపావు. నీతో కలిసి జీవితంలో ఎన్నో సాహసాలు చేయగలిగినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. లవ్ యూ’ అని తెలిపారు.
News January 18, 2025
తిరుమలలో అపచారం
కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు కొండపైకి కోడిగుడ్డు పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ నిషేధిత ఆహారపదార్థాలు తింటుండగా భక్తులు చూసి అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుమల నియమాలు తమకు తెలియదని వారు చెప్పారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అలిపిరి వద్ద తనిఖీ సిబ్బంది డొల్లతనం వల్లే ఇలా జరిగిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News January 18, 2025
GOOD NEWS: ఉచితంగా ప్లాట్లు
AP: ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి <<15179066>>ఇళ్ల స్థలాలు<<>> ఇస్తామని నిన్న ప్రకటించింది. ఇవి ఉచితమా? డబ్బు చెల్లించాలా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాట్లు పూర్తి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. కేంద్ర పథకాలతో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. గతంలో ప్లాట్లు పొంది ఇళ్లు నిర్మించుకోని వారికి వాటిని రద్దు చేసి కొత్త ప్లాట్లు ఇస్తారు.