News May 27, 2024
ఖమ్మం జిల్లాలో 13.01 శాతం పోలింగ్ నమోదు

నేడు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న శాసన మండలి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉదయం 10 గంటల వరకు 13. 01 శాతం పోలింగ్ నమోదయినట్లు సంబంధిత ఎన్నికల అధికారులు తెలియజేశారు. కాగా, జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి.
Similar News
News July 5, 2025
ఖమ్మం జిల్లాలో ముగిసిన కళాశాలల బంద్

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో ఈనెల 3, 4న PDSU తలపెట్టిన 48 గంటల కళాశాలల బంద్ శుక్రవారం నాటికి ముగిసింది. బంద్ సందర్భంగా ఖమ్మం కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల ముందు PDSU నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్యలు మాత్రం తీరడం లేదని దుయ్యబట్టారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News July 4, 2025
వరద విపత్తుల నిర్వహణకు సిద్ధం: ఖమ్మం కలెక్టర్

వరద విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణపై సమావేశమయ్యారు. గత సంవత్సరం వచ్చిన భారీ వరదలు, విపత్తుల నిర్వహణ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ప్రణాళిక తదితర అంశాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
News May 8, 2025
ఖమ్మం: ఆసుపత్రి నర్స్.. అనుమానాస్పద మృతి

సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భూక్య కళ్యాణి(22) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన కళ్యాణి సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ మసీదు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.