News May 27, 2024
చిత్తూరు: మందకొడిగా సర్వీస్ ఓట్ల పోలింగ్
చిత్తూరు జిల్లాలో త్రివిధ దళాలకు చెందిన 3380 మంది ఉద్యోగులు సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా పూతలపట్టులో 1075, అత్యల్పంగా నగరిలో 139 ఓట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం(ETPBS) ద్వారా వీరంతా ఓటు వేసేలా అవకాశం కల్పించారు. ఈక్రమంలో ఇప్పటి వరకు 800 మంది ఓటు వేశారు. కౌంటింగ్ జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలలోగా మిగిలిన వాళ్లు ఓటు వేయవచ్చు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2010 సెప్టెంబర్ 1న జిల్లాలో రెండు ప్రధాన అభివృద్ధి పనులు ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు. రెండోది మన్నవరం ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టు పనులను మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
News December 27, 2024
కాలినడకన తిరుమల చేరుకున్న పీవీ సింధు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన గురువారం తిరుమలకు చేరుకున్నారు. నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.
News December 25, 2024
అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన
తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.’ అంటూ ట్విట్టర్లో విమర్శించారు.