News May 27, 2024
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జూన్ 4న కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా, పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 16, 2026
KNR: ఎన్నికల నగారా.. టికెట్ వేటలో ఆశావహులు

మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్‌లో రాజకీయ సందడి మొదలైంది. కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో టికెట్ ఆశావహుల తాకిడి పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు తమ గళాన్ని వినిపిస్తూ, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
News January 14, 2026
KNR జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా నవీన్‌కుమార్ గౌడ్

కరీంనగర్ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా సైదాపూర్ ఉప సర్పంచ్ గోపగోని నవీన్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఉప సర్పంచ్ల సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా నామని విజేందర్, ఉపాధ్యక్షులుగా దొంతరవేనా రమేష్, గుండారపు మహేష్, కట్కమ్ మనీష్, సంయుక్త కార్యదర్శులుగా మిడిదొడ్డి సుధాకర్, జక్కుల అనిల్, అధికార ప్రతినిధిగా మేకల మహేష్‌ను ఎన్నుకున్నారు.
News January 14, 2026
KNR: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత

కరీంనగర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, తగిన అవగాహన లేక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని క్రయవిక్రయదారులు వాపోతున్నారు.


