News May 28, 2024
చిత్తూరు: 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ఎన్నికల విధులకు గైర్హాజరైన 65 మందిని సస్పెండ్ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ సోమవారం పేర్కొన్నారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, కొందరు రాతపూర్వక సంజాయిషీ ఇచ్చారని తెలిపారు. సంతృప్తికర సమాధానం ఇవ్వని సిబ్బందిని ఎన్నికల నిబంధనల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
Similar News
News July 8, 2025
చిత్తూరు: వారి మధ్య నలుగుతున్నది పోలీసులే!

మామిడి రైతుల సమస్యల చుట్టూ జిల్లా రాజకీయం తిరుగుతుంది. పరిశ్రమలు వారు రూ. 8, ప్రభుత్వం రూ. 4, మొత్తం రూ.12 ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు న్యాయం చేయడం లేదని YCP బదులిస్తుంది. ఇటీవల YS జగన్ పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనలు నేపథ్యంలో సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. నిజానికి ఇరు పార్టీల రాజకీయం నడుమ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చర్చించుకుంటున్నారు.
News July 8, 2025
జగన్ రాక.. వైసీపీ నేతలకు నోటీసులు

చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బంగారుపాళ్యం మార్కెట్‌లో 500 మందితోనే మామిడి రైతులను పరామర్శించాలని పోలీసులు సూచించారు. ఈనేపథ్యంలో భారీ సంఖ్యలో నాయకులు బుధవారం బంగారుపాళ్యం వెళ్లకుండా ఉండేలా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని వైసీపీ ముఖ్య నాయకులలకు మంగళవారం నుంచే నోటీసులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ చేయరాదని నోటీసుల్లో పేర్కొన్నారు.
News July 8, 2025
10న చిత్తూరు జిల్లాలో PTM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.