News May 29, 2024

హైదరాబాద్‌లో హోటళ్ల‌కు నోటీసులు

image

ఫుడ్ సేఫ్టీ అధికారులు గత 42 రోజుల్లో 83 రెస్టారెంట్లు, తదితర హోటల్స్‌ను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి మే 27 వరకు రైడ్స్‌ జరిగాయన్నారు. గ్రేటర్‌‌లో నిల్వచేసిన మాంసం, ఎక్స్‌పైరీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డించిన 58 రెస్టారెంట్‌లు, అపరిశుభ్రత‌తో పాటు లైసెన్స్‌ లేని మరో 10 హోటళ్లకు నోటీసులు అందించామన్నారు. ఇక జూన్ 1 నుంచి నిబంధనలు పాటించని హోటళ్లకు FINE విధించనున్నారు. SHARE IT

Similar News

News September 21, 2024

HYD: ఇండోర్, లక్నోకు వెళ్లిన మేయర్, కార్పొరేటర్లు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్‌కి వెళ్లారు. స్టడీ టూర్‌లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

News September 21, 2024

HYD: విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: సీఎండీ

image

నూతన విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతివారం అధికారులు ఒకరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 21, 2024

HYD: రూ.6,661 కోట్లతో నాగపూర్ జాతీయ రహదారి

image

హైదరాబాద్-నాగపూర్ కారిడార్‌లోని 251KM హైవేను NHAI సంస్థ, హైవే ఇన్ఫ్రా స్ట్రక్చర్ ట్రస్ట్‌కు టోల్-ఆపరేట్- ట్రాన్స్‌ఫర్ (TOT) మోడల్‌లో రూ.6,661 కోట్లకు కేటాయించినట్లుగా తెలిపింది. HYD నగరం నుంచి నాగపూర్, నాగపూర్ నుంచి HYD వెళ్లే వాహనదారుల నుంచి TOT మోడల్లో టోల్ ఛార్జీలను వసూలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు.