News May 29, 2024

తెనాలి యువకుడు హైదరాబాద్‌లో దుర్మరణం

image

తెనాలి గాంధీనగర్‌కు చెందిన మహమ్మద్ హుస్సేన్ బేగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతను తన సోదరుడితో పాటు ఆదిభట్ల ప్రాంతంలో రూములో ఉంటున్నాడు. సోమవారం ఉదయం వీళ్లిద్దరితో పాటు మరో యువకుడు బైకు మీద ఉద్యోగాలకు బయల్దేరారు. ఈ క్రమంలో మీర్‌పేట్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో హుస్సేన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని సోదరుడు ఇస్మాయిల్ కోమాలోకి వెళ్లాడు.

Similar News

News September 13, 2025

పెదనందిపాడు: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

image

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం సమీపంలో శనివారం విషాద ఘటన జరిగింది. అన్నపర్రు నుంచి కొప్పర్రు వెళ్ళే రహదారి పక్కన చేపల చెరువు దగ్గర పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగుపాటు సంభవించి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్నపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి సామ్రాజ్యం (రజిక), తన్నీరు నాగమ్మ (వడ్డెర)గా గుర్తించారు.

News September 13, 2025

నేడు గుంటూరు కలెక్టర్ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తమీమ్ అన్సారీయా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన IAS బదిలీల్లో ఈమె ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ నేడు గుంటూరుకు రానున్నారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్‌లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్.

News September 12, 2025

నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.