News May 29, 2024

ప్రకాశం జిల్లాలో వేడిగాలులు

image

ప్రకాశం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఆరు గంటలు దాటినా వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పెరుగుతున్న వడగాడ్పుల తీవ్రత కారణంగా జనం బయటకు అడుగు పెట్టేందుకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జిల్లాలోని 21 గ్రామాల్లో మంగళవారం 40 డిగ్రీలకు పైగా నమోదవ్వగా, మాలెపాడులో అత్యధికంగా 42.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News November 10, 2025

రేపే సీఎం రాక.. బందోబస్తు వివరాలు వెల్లడించిన ఎస్పీ!

image

రేపు పీసీపల్లి మండలంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బందోబస్తు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా 6 ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.

News November 10, 2025

ప్రకాశమంతా ఒకటే చర్చ.. ఆ ప్రకటన వచ్చేనా?

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మార్కాపురం జిల్లా ప్రకటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబు నేడు నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటుపై తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లాగా, శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురంలో విలీనం చేస్తారా? లేదా అన్నది కూడా తేలే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

News November 10, 2025

ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్.!

image

ప్రకాశంలో 11వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పీసీ పల్లిలోని పెదఇర్లపాడు వద్ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు పెదయిర్లపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 10.35 నుంచి 12.15 వరకు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.